News November 6, 2024
Dy.cm పవన్, లోకేశ్ ఫొటోల మార్ఫింగ్.. పోలీసుల అదుపులో విశాఖ వ్యక్తి

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను దువ్వాడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్.రతన్ కాంత్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. 88వ వార్డు యాదవ జగ్గరాజుపేటకు చెందిన బి.వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
Similar News
News March 1, 2026
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
News March 1, 2026
విశాఖ: వెంకటాద్రి వంటిల్లు వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గేటు సమీపాన వెంకటాద్రి వంటిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోలో ఉన్న భార్యాభర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
News March 1, 2026
రెండో రోజు సెలబ్రిటీ క్రికెట్ పోటీలు ప్రారంభించిన గంటా

మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండో రోజు పోటీలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. బలమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అందరికీ ఆనందాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుతో ముగుస్తున్న సెలబ్రిటీ క్రికెట్ విశాఖ ప్రజలకు మంచి అనుభూతిని అందించిందన్నారు. టాస్ వేసి పోటీలను ఆరంభించారు.


