News November 6, 2024

HYD: మెట్రో ముందడుగు.. GOOD NEWS

image

రాష్ట్ర ప్రభుత్వం రూ.2,741 కోట్ల అంచనాతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన HYD పాతబస్తీ మెట్రో (MGBS- చంద్రాయన గుట్ట)భూ సేకరణపై కలెక్టర్ అనుదీప్ మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 2 విడతల్లో 400 వరకు ఆస్తులను నోటిఫై చేశారు. తాజాగా.. దారుల్‌షిఫా నుంచి శాలిబండ వరకు సేకరించాల్సిన భూమిపై నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యంతరాలను 2025 జూన్ 2 వరకు బేగంపేట మెట్రో రైల్ కార్యాలయంలో అందించాలి.

Similar News

News November 6, 2024

HYD: లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధం..!

image

ఉమ్మడి RR, HYD జిల్లాల్లో లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధమైంది. GHMC పరిధిలో 28 లక్షల కుటుంబాలు, RRలో 6.57 లక్షలు, వికారాబాద్ 6.54 లక్షల కుటుంబాల సర్వే జరగనుంది. మరోవైపు GHMC-21 వేల ఎన్యుమరేటర్లు, RR 5,344, VKB-2024 మంది సర్వే చేయనున్నారు. మొదటి దశ నేటి నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నది. ఒక్కో సూపర్‌వైజర్ కింద 10 మంది ఎన్యుమరేటర్లు పనిచేయనున్నారు.

News November 5, 2024

HYD: రాహుల్ గాంధీ బావర్చీకి రావాలని డిమాండ్

image

HYDలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్, అశోక్‌నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని బావర్చీలో కుర్చీ వేసి, ప్లేట్‌‌లో బిర్యానీ వడ్డించారు. బిర్యానీ చల్లబడకముందే రావాలని BRS సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచించారు. పలువురు నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీ రావాలని కోరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

News November 5, 2024

HYD: నాంపల్లి క్రిమినల్ కోర్టుకు దీపాదాస్ మూన్షీ

image

నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి హాజరయ్యారు. దీపా దాస్‌పై BJP నేత ప్రభాకర్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఆయనపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసు వేసింది. దీపాదాస్‌తో పాటు కోర్టుకు బీజేపీ నేత ప్రభాకర్ హాజరయ్యారు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.