News November 6, 2024
త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్ విడుదల
TG: 2050 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేయనుంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్‌లకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. ఏడాదిలోపు మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చేలా, కార్గో సేవలూ అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.
Similar News
News November 6, 2024
క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఢిల్లీకి పవన్
ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News November 6, 2024
‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్లు భారీగా చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. పుణే, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, హుబ్లీ, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌తోపాటు దుబాయ్ లేదా అమెరికాలో ప్రెస్ మీట్లు, పబ్లిక్ ఈవెంట్లు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 6, 2024
గెలిచేదెవరైనా US మరింత ఒంటరవ్వడం ఖాయం: జైశంకర్
ప్రెసిడెంట్‌గా గెలిచేదెవరైనా అమెరికా మరింత ఒంటరి (Isolationist) అవ్వడం ఖాయమేనని EAM జైశంకర్ అన్నారు. ఇతర దేశాలపై వారి పెత్తనం, రాజకీయ జోక్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఒబామా హయాం నుంచి గ్లోబల్ కమిట్‌మెంట్స్ అంశంలో అమెరికా అప్రమత్తంగా ఉంటోందని వివరించారు. డొనాల్డ్ ట్రంప్ దీనిని బాహాటంగానే చెప్తుంటారని పేర్కొన్నారు. ఏదేమైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.