News November 6, 2024
కుప్పం : ఓడిన అభ్యర్థి పుట్టినరోజు నాడే గెలిచిన అభ్యర్థి రాజీనామా

టీడీపీ కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన త్రిలోక్ పుట్టినరోజు నాడే మున్సిపల్ ఛైర్మన్‌గా గెలుపొందిన డా.సుధీర్ రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయంగా మారింది. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో డా.సుధీర్ వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్ , కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా త్రిలోక్ సతీమణి భాగ్యలక్ష్మికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News December 30, 2025
పుంగనూరు: బైకును ఢీకొన్న RTC బస్సు.. ఒకరు స్పాట్ డెడ్

పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న RTC బస్సు బైకును ఢీకొనడంతో గుడిసి బండకు చెందిన సోమశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

రవి సీజన్లో పంటల సాగు జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలకు అవసరమైన 2183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
చిత్తూరులో తగ్గిన నేరాల శాతం: SP

చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా, ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.


