News November 6, 2024
నీరు పొదుపుగా వాడుకోండి: KRMB లేఖ

సాగునీటి ప్రాజెక్టుల్లోని నీటిని తాగు, సాగుకి వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. 2025 వానాకాలం వరకు రిజర్వాయర్లలో నీరు ఉండేలా చూసుకోవాలని సూచించింది. విద్యుదుత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని, అవసరం లేకుండా ఇతర కాంపోనెంట్ల ద్వారా నీటి తరలింపు ఆపాలంది.
Similar News
News September 15, 2025
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైలు బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు బుక్ చేసుకొనే వీలుంటుంది. OCT 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్లకూ వర్తింపజేయనుంది. SHARE IT.
News September 15, 2025
భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్‌ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
News September 15, 2025
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.