News November 6, 2024
ఎల్లుండి ఓటీటీలోకి ‘వేట్టయన్’
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 8 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.
Similar News
News November 6, 2024
ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ
జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.
News November 6, 2024
పార్కింగ్‌లో జపాన్ ఉద్యోగుల కొత్త పద్ధతి!
జపాన్ టెక్నాలజీలో దూసుకెళ్తూనే సరికొత్త పద్ధతులను తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అక్కడ ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం ఇంట్రెస్టింగ్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన వారు తమ కారును దూరంగా పార్క్ చేయాలి. అలా చేయడం వల్ల ఆలస్యంగా వచ్చేవారు తమ కారును దగ్గరగా పార్క్ చేసి సమయానికి ఆఫీసుకు వచ్చేలా చేస్తుంది. ఉద్యోగులు పరస్పరంగా ఇలా ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది.
News November 6, 2024
రిలీజైన నెలరోజుల్లోనే OTTలోకి ‘లక్కీ భాస్కర్’?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే, రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.