News November 6, 2024

కుటుంబ సర్వే.. ఫొటోలు తీయరు, పత్రాలేమీ తీసుకోరు

image

TG: నేటి నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలను అడగనున్నారు. అయితే సర్వేలో భాగంగా కుటుంబ ఫొటోలు ఏమీ తీయరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. ఇంట్లో అందరూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది. కుటుంబీకుల్లో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులు వారి ప్రస్తుత, పూర్వపు పదవీ వివరాలు చెప్పాలి. సమాచారం గోప్యంగా ఉంచుతారు.

Similar News

News September 15, 2025

భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

image

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్‌‌ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

News September 15, 2025

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

image

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 15, 2025

బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

image

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.