News November 6, 2024
DON’T MISS.. ఇవాళే లాస్ట్ డేట్
తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ <<14532979>>గ్రాడ్యుయేట్<<>>, టీచర్ MLC, APలోని గుంటూరు-కృష్ణా, తూర్పు-ప.గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల <
Similar News
News January 14, 2025
ఉత్తరాయణంలోకి సూర్యుడు
సంక్రాంతి రోజైన ఇవాళ సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. దీంతో దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కాగా ఈ పండుగ అన్నింటిలోకెల్లా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇవాళ సూర్యుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్తరాయణంలో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
News January 14, 2025
నేటి నుంచి ఇండియన్ ఓపెన్
నేటి నుంచి ఢిల్లీ వేదికగా ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది. పెళ్లి తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నీ ఇదే. అంతకుముందు గత ఏడాది ఆమె SMAT ఉమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచారు. సింధు తొలి రౌండ్లో చైనీస్ తైపీ ప్లేయర్ యువోయున్తో తలపడనున్నారు. మరోవైపు డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ ఫేవరెట్లుగా ఉన్నారు.
News January 14, 2025
భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది అప్పుడే: మోహన్ భగవత్
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరిగిన రోజే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ఆ రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలని చెప్పారు. రామ మందిర ఉద్యమం ఏ ఒక్కరినీ వ్యతిరేకించడానికి కాదని తెలిపారు. ఈ క్రమంలో భారత్ స్వతంత్రంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడుతుందని పేర్కొన్నారు. కాగా గత ఏడాది జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే.