News November 6, 2024

ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారం

image

APలో మరో ఘోరం జరిగింది. నెల్లూరు నగరంలో రీల్స్ పేరుతో బాలిక(14)ను మభ్యపెట్టి ఆటోడ్రైవర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి, ఇతర బంధువులు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై నవాబుపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News December 27, 2024

భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా

image

AP: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

News December 27, 2024

డైరెక్టర్ కన్నుమూత

image

తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.

News December 27, 2024

నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు

image

బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్‌ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.