News November 6, 2024
విద్యార్థులకు శుభవార్త
JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఇకపై వరుసగా మూడేళ్లు రాయొచ్చు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉండగా, 2025లో నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్ష నుంచి మూడు సార్లు అటెంప్ట్ చేయొచ్చని కేంద్రం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2023లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ సారి పరీక్ష రాయవచ్చని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొంది.
Similar News
News November 6, 2024
ట్రంప్ గెలుపు: రష్యాకు కాదు ఉక్రెయిన్‌కే షాక్
డొనాల్డ్ ట్రంప్ విజయం ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాను యుద్ధాలు చేసేందుకు కాదు ఆపేందుకు వచ్చానని గెలుపు స్పీచ్‌లోనే ట్రంప్ స్పష్టం చేశారు. పైగా నాటోపై ఖర్చుచేయడం దండగని గతంలో చాలాసార్లు చెప్పారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మిలిటరీ సాయం కింద ఉక్రెయిన్‌కు అమెరికా $64 బిలియన్లు సాయం చేసింది. ఇకపై దీనిని ఆపేయొచ్చు. మునుపటి స్థాయిలో నైతిక మద్దతు ఇవ్వకపోవచ్చు.
News November 6, 2024
RCBకే మళ్లీ ఆడతానేమో: మ్యాక్స్‌వెల్
రిటెన్షన్ల ప్రక్రియ చేపట్టేముందు RCB తనను సంప్రదించిందని ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపారు. రిటైన్ చేసుకోవటం లేదని, తమను అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. ‘అరగంటపాటు నాతో ఆండీ ఫ్లవర్, మో బోబాట్ జూమ్ కాల్‌లో మాట్లాడారు. రిటైన్ చేసుకోకపోవడానికి కారణం చెప్పారు. అదో గొప్ప ఫ్రాంచైజీ. మళ్లీ ఆ జట్టులోకి వెళ్తానేమో. RCBతో నా ప్రయాణం ముగిసిందని చెప్పలేను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News November 6, 2024
3ఏళ్లలో అందుబాటులోకి మామునూర్ ఎయిర్‌పోర్టు: కోమటిరెడ్డి
TG: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును 3ఏళ్లలో అందుబాటులోకి తేవాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణపనులు ఉండాలని సూచించారు. ఈమేరకు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి 15రోజులకోసారి పనుల తీరుపై తాను సమీక్షిస్తానని చెప్పారు. ఎయిర్‌పోర్టును ఉడాన్ స్కీమ్‌తో అనుసంధానం చేసి పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలన్నారు.