News November 6, 2024

పుంజుకున్న కమలా హారిస్.. తేడా 20 ఓట్లే

image

అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రత్యర్థితో పోలిస్తే కేవలం 20 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 230, కమల 210తో నిలిచారు. ఒకానొక దశలో 100 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమెను కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వాషింగ్టన్ ఆదుకున్నాయి. నార్త్ కరోలినాను దక్కించుకోవడంతో వైట్‌హౌస్‌కు ట్రంప్ మార్గం సుగమమైందని తెలుస్తోంది.

Similar News

News November 6, 2024

LMV లైసెన్స్‌తో రవాణా వాహనం నడపొచ్చు: సుప్రీం

image

లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాలు నడపొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం LMV లైసెన్స్‌తో 7500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాలను వ్యాపారస్థులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు నడపొచ్చని స్పష్టం చేసింది. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీలు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన ఈ సమస్యపై చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

News November 6, 2024

ట్రంప్ గెలుపు: రష్యాకు కాదు ఉక్రెయిన్‌కే షాక్

image

డొనాల్డ్ ట్రంప్ విజయం ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాను యుద్ధాలు చేసేందుకు కాదు ఆపేందుకు వచ్చానని గెలుపు స్పీచ్‌లోనే ట్రంప్ స్పష్టం చేశారు. పైగా నాటోపై ఖర్చుచేయడం దండగని గతంలో చాలాసార్లు చెప్పారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మిలిటరీ సాయం కింద ఉక్రెయిన్‌కు అమెరికా $64 బిలియన్లు సాయం చేసింది. ఇకపై దీనిని ఆపేయొచ్చు. మునుపటి స్థాయిలో నైతిక మద్దతు ఇవ్వకపోవచ్చు.

News November 6, 2024

RCBకే మళ్లీ ఆడతానేమో: మ్యాక్స్‌వెల్

image

రిటెన్షన్ల ప్రక్రియ చేపట్టేముందు RCB తనను సంప్రదించిందని ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపారు. రిటైన్ చేసుకోవటం లేదని, తమను అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. ‘అరగంటపాటు నాతో ఆండీ ఫ్లవర్, మో బోబాట్ జూమ్ కాల్‌లో మాట్లాడారు. రిటైన్ చేసుకోకపోవడానికి కారణం చెప్పారు. అదో గొప్ప ఫ్రాంచైజీ. మళ్లీ ఆ జట్టులోకి వెళ్తానేమో. RCBతో నా ప్రయాణం ముగిసిందని చెప్పలేను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.