News November 6, 2024
నెల్లూరు: ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందిపై వేటు

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. నెల్లూరులో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు అయింది. ఆయనను ఎస్కార్ట్ పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిందితుడిని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడికి, ఆయన భార్యకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. SP ఎస్కార్ట్ పోలీసులను సస్పెండ్ చేశారు.
Similar News
News March 16, 2026
నెల్లూరు: అనాధ శిశువు గురించి ఎవరికైనా తెలుసా ?

ఫోటోలోని అనాధ మగ శిశువును శిశు గృహ నందు సంరక్షణలో ఉన్నట్లు ICDS PD హేనా సుజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిశువును జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రచురణ తేదీ నుంచి 30 రోజులలోగా తగిన సాక్ష్యాధారాలతో సహా ICDS PDని సంప్రదించాలని కోరారు. లేని పక్షంలో శిశువును అనాథ శిశువుగా ప్రకటిస్తామన్నారు. అలాగే ప్రభుత్వంచే నిర్దేశించబడిన నియమ నిబంధనల ప్రకారము దత్తతకు ఇవ్వడం జరుగుతుందన్నారు.
News March 16, 2026
టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నగరంలోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఈవో బాలాజీ రావు పరిశీలించారు. పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని డీఈఓకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
News March 16, 2026
నెల్లూరు : మరి కాసేపట్లో మొదలుకానున్న పది పరీక్షలు

10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో మొదలుకానున్నాయి. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 174 కేంద్రాలలో 28,589 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 24 సిట్టింగ్ స్క్వార్డులు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షను పర్యవేక్షించనున్నారు. పరీక్షల్లో సమస్యలు ఎదురైతే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


