News November 6, 2024

గెలిచేదెవరైనా US మరింత ఒంటరవ్వడం ఖాయం: జైశంకర్

image

ప్రెసిడెంట్‌గా గెలిచేదెవరైనా అమెరికా మరింత ఒంటరి (Isolationist) అవ్వడం ఖాయమేనని EAM జైశంకర్ అన్నారు. ఇతర దేశాలపై వారి పెత్తనం, రాజకీయ జోక్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఒబామా హయాం నుంచి గ్లోబల్ కమిట్‌మెంట్స్‌ అంశంలో అమెరికా అప్రమత్తంగా ఉంటోందని వివరించారు. డొనాల్డ్ ట్రంప్ దీనిని బాహాటంగానే చెప్తుంటారని పేర్కొన్నారు. ఏదేమైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 26, 2024

జనవరి 3న బీసీ విద్యార్థులతో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్.కృష్ణయ్య

image

16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌బాగ్‌లో వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజురీయంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడించనున్నట్లు తెలిపారు.

News December 26, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో శాంటాక్లాజ్ ర్యాలీ క‌నిపించ‌లేదు. బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. Sensex 78,472 (-0.39) వ‌ద్ద‌, Nifty 23,750(+22) వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఆటో, ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్స్‌, క‌న్జూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, పీఎస్‌యూ బ్యాంక్స్ కొంత‌మేర రాణించాయి. అధిక వెయిటేజీ రంగాలు రెడ్‌లోనే ముగిశాయి. అదానీ పోర్ట్స్ అత్యధికంగా 5% లాభపడింది. Titan, Asian Paints టాప్ లూజర్స్.

News December 26, 2024

FLASH: వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు ఏర్పడి వెదర్ చల్లగా మారింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?