News November 6, 2024
వరంగల్: క్వింటా తేజ మిర్చి ధర రూ.16,800

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం లాగే ఈరోజు సైతం మిర్చి ధరలు తటస్థంగా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.16,800 ధర రాగా.. నేడు సైతం అదే ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15 వేల ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.15,000 ధర రాగా, ఈరోజు రూ.500 తగ్గి రూ.14,500కి చేరిందని అధికారులు తెలిపారు.
Similar News
News July 4, 2025
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
News May 7, 2025
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పరీక్ష ఫీజులు చెల్లించని కారణంగా డిగ్రీ(రెగ్యులర్) 2వ, 4వ, 6వ, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మరోసారి ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News May 7, 2025
వరంగల్: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.