News November 6, 2024
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. CRDA పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది.
Similar News
News November 6, 2024
రేపు అనుష్క మూవీ అప్డేట్స్
హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.
News November 6, 2024
ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా పాక్ ప్లేయర్
పాకిస్థాన్ ఆటగాడు నోమన్ అలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికయ్యారు. అతడితోపాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను కూడా నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నోమన్ అలీ విశేషంగా రాణించారు. మొత్తం 20 వికెట్లు పడగొట్టి మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించారు.
News November 6, 2024
రేపు ఈ జిల్లాలో వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.