News November 6, 2024

ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 6, 2024

BREAKING: రాష్ట్రంలో నిలిచిన మద్యం సరఫరా

image

TG: సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. కాగా రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.

News November 6, 2024

రేపు అనుష్క మూవీ అప్డేట్స్

image

హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.

News November 6, 2024

ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా పాక్ ప్లేయర్

image

పాకిస్థాన్ ఆటగాడు నోమన్ అలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికయ్యారు. అతడితోపాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను కూడా నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నోమన్ అలీ విశేషంగా రాణించారు. మొత్తం 20 వికెట్లు పడగొట్టి మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించారు.