News November 6, 2024

అక్రమ వలసలు అడ్డుకుంటాం: ట్రంప్

image

తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘స్వింగ్ రాష్ట్రాల్లో నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పాపులర్ ఓట్లలోనూ మనదే ఆధిక్యం. మనకు 315 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. ఎవరైనా దేశంలోకి చట్టబద్ధంగా వచ్చేలా చట్టాలు తయారు చేస్తా. సరిహద్దులను నిర్ణయిస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 26, 2024

నిమిషానికి 158 బిర్యానీలు తినేశారు!

image

సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, పండుగొచ్చినా బిర్యానీలు తినాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఆర్డర్ చేస్తే ఇంటికే బిర్యానీ వస్తుండటంతో స్విగ్గీ బుకింగ్స్‌లో బిర్యానీ <<14970078>>టాప్‌లో<<>> నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది నిమిషానికి ఏకంగా 158 బిర్యానీలు బుక్ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 150గా ఉండగా 2022లో 137, 2021లో 115, 2020లో నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వచ్చేవి. ఏటా బుకింగ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.

News December 26, 2024

విరాట్ కోహ్లీకి భారీ జరిమానా

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్‌ను విరాట్ <<14982204>>స్లెడ్జ్<<>> చేసిన ఘటనపై ICC తీవ్రంగా స్పందించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఒక డీమెరిట్ పాయింట్‌ విధించింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆయన్ను తొలగిస్తారని వార్తలు రాగా ఫైన్‌తో సరిపెట్టింది.

News December 26, 2024

బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. టాలీవుడ్‌కు బ్రాండ్ తీసుకొచ్చి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.