News November 6, 2024
అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతంటే?
US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రెసిడెంట్ జీతం ఎంతనే చర్చ మొదలైంది. వార్షిక వేతనం 400,000 డాలర్లు(₹3.36 కోట్లు) ఉంటుంది. వీటితో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం ఏడాదికి మరో 50,000(₹42లక్షలు) డాలర్లు ఇస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్‌హౌస్ నిర్వహణ వంటి ఖర్చుల కోసం 1,00,000(₹84 లక్షలు) డాలర్లు, 19000 డాలర్లు ఆతిథ్యం, ఈవెంట్ల కోసం ఇస్తారు. 2001లో చివరిగా జీతాలు పెంచారు.
Similar News
News November 6, 2024
BREAKING: రాష్ట్రంలో నిలిచిన మద్యం సరఫరా
TG: సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. కాగా రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.
News November 6, 2024
రేపు అనుష్క మూవీ అప్డేట్స్
హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.
News November 6, 2024
ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా పాక్ ప్లేయర్
పాకిస్థాన్ ఆటగాడు నోమన్ అలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికయ్యారు. అతడితోపాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను కూడా నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నోమన్ అలీ విశేషంగా రాణించారు. మొత్తం 20 వికెట్లు పడగొట్టి మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించారు.