News November 6, 2024
CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం
సీఆర్డీఏ పరిధి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సీఆర్డీఏ పరిధిలోకి చేరింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1069.55 చదరపు కి.మీ విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను చేర్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధి నిధులతో పల్నాడు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 22, 2024
నేడు దేవకీనంద వాసుదేవ చిత్రం విడుదల సంబరాలు: GNT
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా నటించిన 2వ చిత్రం ‘దేవకీనంద వాసుదేవ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొరిటెపాడులోని హరిహర మహాల్ వద్ద ఉదయం 11.30 ని.లకు గల్లా అభిమానులు కేక్ కటింగ్ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులు, అభిమానులు హాల్ వద్దకు భారీగా తరలి రావాలని గల్లా అశోక్ అభిమానులు పిలుపునిచ్చారు.
News November 22, 2024
గుంటూరులో డిసెంబర్ 14న లోక్ అదాలత్
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టు ప్రాంగణాల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి YVSBGV పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు, పోలీసులు లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, చెక్ బౌన్స్ కేసులు రాజీ చేసుకోవాలని చెప్పారు.
News November 21, 2024
గుంటూరు: బోరుగడ్డ పిటిషన్‌ను మూడోసారి డిస్మిస్ చేసిన కోర్ట్
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పలు కేసులపై రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. బోరుగడ్డ అనిల్ కేసులో అరండల్ పేట పోలీసులు సాక్ష్యాలు కోర్టు ముందు హాజరు పరిచారు. పోలీసు వారు ఇచ్చిన సాక్ష్యాల మేరకు కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. బెయిల్ పొందడానికి బోరుగడ్డ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని గుంటూరు పోలీసులు తెలిపారు.