News November 6, 2024

ట్రంప్ విజయం.. బాలకృష్ణ ఏమన్నారంటే?

image

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ‘ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్‌స్టాపబుల్‌గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భద్రతకు సహకరించాలని ట్రంప్‌ను కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

image

ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో భారత్ ఓడిపోయింది. తొలుత భారత మహిళల జట్టు 281/7 రన్స్ చేసింది. ప్రతిక (64), స్మృతి (58), హర్లీన్ (54) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లిచ్‌ఫీల్డ్ 88 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. మూనీ 77 రన్స్‌తో రాణించారు.

News September 14, 2025

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CM

image

AP: తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, ప్రతి బస్సుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త బస్ స్టేషన్లో 150 బస్సులు ఒకేసారి నిలిపేలా బస్‌బే ఉండాలని, లక్ష మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిని నిర్మించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించాలని సూచించారు.

News September 14, 2025

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్‌దే: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయం హైకమాండ్ చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్, మంత్రులతో సమావేశమైన రేవంత్.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. బూత్‌ల వారీగా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.