News November 6, 2024
రేపు అనుష్క మూవీ అప్డేట్స్
హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.
Similar News
News November 6, 2024
KTR ఆరోపణలపై స్పందించిన జలమండలి
TG: సుంకిశాల కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని KTR చేసిన ఆరోపణలపై వాటర్ బోర్డు స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. సుంకిశాల గోడ కూలడంపై విచారణకు కమిటీ వేశామని తెలిపింది. అటు నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేకపోయిన కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించింది. విచారణ తర్వాత చర్యలుంటాయంది.
News November 6, 2024
పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
News November 6, 2024
అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి
AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.