News November 6, 2024
మిస్టీరియస్.. ఈ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే!
భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్‌కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.
Similar News
News November 7, 2024
తలైవాస్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలుగు టైటాన్స్
ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన తమిళ్ తలైవాస్‌పై గెలిచి బదులు తీర్చుకుంది. ఈరోజు గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 34-35 తేడాతో టైటాన్స్ గెలుపొందింది. కాగా ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన టైటాన్స్ 4 గెలిచి 4వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో పుణేరి పల్టాన్స్(7లో 5 గెలుపు) ఉండగా చివరి స్థానంలో గుజరాత్ జెయింట్స్(5లో ఒక గెలుపు) ఉన్నాయి.
News November 6, 2024
అకౌంట్లలోకి డబ్బులు.. కీలక ప్రకటన
AP: ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమచేసేలా పాత పద్ధతిని అవలంబిస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. బకాయిలు రూ.3,500 కోట్లు విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాలేజీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో డిపాజిట్ అయ్యేవి.
News November 6, 2024
మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్‌గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. IPLలోనూ SRHకి కెప్టెన్‌గా కప్ అందించారు.