News November 6, 2024
శరవేగంగా కార్తీక మాస లక్ష దీపోత్సవ ఏర్పాట్లు
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల సహకారంతో జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 8, 9, 10 తేదీల్లో నెల్లూరు నగరంలోని VRC మైదానంలో లక్ష దీపోత్సవాలు నిర్వహించనున్నారు. లక్ష దీపోత్సవం కోసం ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.
Similar News
News November 6, 2024
నెల్లూరు: పదో తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి
నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మిపురంలోని ఓ ప్రయివేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ముత్తుకూరు RR కాలనీకి చెందిన దువ్వూరు ప్రణీత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2024
నెల్లూరు: అండర్ బ్రిడ్జ్ వద్ద నిలిచిన వర్షపు నీరు
నెల్లూరు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్‌లో వర్షపు నీరు నిలబడి వాహనాల రాకపోకలకు, పాద చారులు నడవడానికి ఆటంకం ఏర్పడింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తూ సహకరిస్తున్నారు.
News November 6, 2024
నెల్లూరు: ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందిపై వేటు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. నెల్లూరులో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు అయింది. ఆయనను ఎస్కార్ట్ పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిందితుడిని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడికి, ఆయన భార్యకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. SP ఎస్కార్ట్ పోలీసులను సస్పెండ్ చేశారు.