News November 6, 2024
అమిత్ షాతో ముగిసిన పవన్ సమావేశం
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి విగ్రహాన్ని పవన్ బహుకరించారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన ఏపీకి తిరిగి పయనమవుతారు.
Similar News
News November 7, 2024
ఈనెల 18-26 మధ్య జిల్లాల్లో BC కమిషన్ పర్యటన
TG: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన BC కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నెల 18 నుంచి 26 వరకు ఈ పర్యటన ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో పర్యటించనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రత్యేక కమిషన్‌తో సమాచారం పంచుకోనుంది.
News November 7, 2024
మోదీని ప్రపంచమంతా ప్రేమిస్తోంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరోసారి ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచశాంతికి కృషి చేద్దామన్నారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని.. భారత్ అద్భుత దేశమని ట్రంప్ కొనియాడారు. భారత్, మోదీని నిజమైన స్నేహితులుగా భావిస్తానని ఆయన తెలిపారు.
News November 7, 2024
ట్రంప్‌నకు అభినందనలు.. హసీనాను పీఎంగా పేర్కొన్న అవామీ లీగ్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలుపుతూ షేక్ హసీనా పేరుతో అవామీ లీగ్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇందులో హసీనాను బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రస్తావించడమే దీనికి కారణం. రిజర్వేషన్లపై నిరసనలతో హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగా మహమ్మద్ యూనస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.