News November 6, 2024

కడప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం.!

image

జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో, ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు, కృషి చేస్తామని YSR జిల్లా నూతన కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనను, కలెక్టర్ ఛాంబర్లో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.

Similar News

News January 17, 2026

కడప టు ఢిల్లీ

image

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.

News January 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810

News January 17, 2026

కడప: నదిలో మృతదేహం కలకలం

image

కడప జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతదేహం నంద్యాల జిల్లాలోని కుందూ నదిలో లభ్యమైంది. శూలం లక్ష్మీదేవి తరచుగా కోయిలకుంట్ల(M) కలుగొట్ల కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు, సంజామల(M) వసంతాపురం గ్రామానికి వచ్చేదని ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.