News November 7, 2024
భీమిని: ‘కలెక్టర్ సారూ మాకు న్యాయం చేయండి’

10వ తరగతి వరకు తరగతులు పెంచాలని విద్యార్థులు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను కోరారు. భీమిని మండలంలోని చిన్నగుడిపేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకే ఉందని, ఆపై చదువులకు వెళ్లే వసతి, రోడ్డులేక చదువు ఆపేయాల్సి వస్తోందని చిన్నారులు వాపోయారు. తమ అభ్యర్థనను, ప్రభుత్వం, కలెక్టర్ గమనించి గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News March 4, 2026
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికపై సమీక్ష

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో పీఓ యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
News March 4, 2026
ADB: ఇంటి వద్దకే భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు

శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
News March 4, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షలు.. 376 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8,529 మంది విద్యార్థులకు గాను 8,153 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 282 మంది, ఒకేషనల్ విభాగంలో 94 మంది కలిపి మొత్తం 376 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


