News November 7, 2024

‘పుష్ప2’ ఐటమ్ సాంగ్, ట్రైలర్‌పై అప్డేట్స్

image

ఎన్నో అంచనాల నడుమ అల్లు అర్జున్ ‘పుష్ప2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్యాచ్‌వర్క్ షూట్ నిన్న ముగిసింది. కాగా శ్రీలీలతో ఐటెమ్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నవంబర్ 12 లేదా 13 నాటికి షూటింగ్ మొత్తం ముగియనుందని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ 3 నిమిషాల 45 సెకన్లకు లాక్ చేసినట్లు టాక్. NOV 15న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. DEC 5న మూవీ విడుదలవనుంది.

Similar News

News December 27, 2024

రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్

image

ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.

News December 27, 2024

విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.

News December 27, 2024

వారం రోజులు సంతాప దినాలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది.