News November 7, 2024
విశాఖ: ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌సీహెచ్.వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలలో మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు ముగింపు రోజున బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే గ్రంథాలయాల్లో కవి సమ్మేళనాలు జరుగుతాయన్నారు.
Similar News
News November 9, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News November 9, 2025
మల్కాపురంలో యువకుడి మృతి

మల్కాపురంలోని ఓ బార్‌లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 8, 2025
విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.


