News November 7, 2024
2 రోజుల్లో అల్పపీడనం.. భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండిలోగా అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడుగా ఈశాన్య రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడతాయంది. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
Similar News
News November 7, 2024
కేసీఆర్‌పై కక్షగట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: KTR
TG: రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా? విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో ఏం చేశారు? కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?’ అని ప్రశ్నించారు.
News November 7, 2024
మధ్యాహ్నం జగన్ కీలక ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై నమోదవుతున్న కేసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా వారం రోజుల్లోనే 107 మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.
News November 7, 2024
ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు
AP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 1,732 మందికి లబ్ధి చేకూర్చనుంది. ఈ నెల 10లోగా అర్హులను ఎంపికచేయాలని అధికారులను ఆదేశించింది. నర్సరీ, విత్తనాల తయారీ, ఆటో కొనుగోలు, ఫొటో స్టూడియో, బ్యూటీ పార్లర్, చిన్న దుకాణాల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల రుణం ఇస్తారు. ఇందులో రూ.50వేల రాయితీ ఉంటుంది. వడ్డీ చెల్లింపుపై త్వరలో క్లారిటీ రానుంది.