News November 7, 2024
స్కూల్ విద్యార్థులకు శుభవార్త
AP: 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది. ఈ కిట్‌లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి ₹120, 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది.
Similar News
News November 7, 2024
కులగణనతో లెక్క తేల్చేస్తారా!
తెలంగాణలో కులగణన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇది జస్ట్ టైం పాస్ అంటూ బీజేపీ కొట్టిపడేస్తోంది. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే ఏమైందంటూ ప్రశ్నిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు సర్వేకు వివరాలు ఇచ్చేది లేదంటున్నారు. అయితే అన్ని వర్గాలకు సర్వేతో ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని, రిజర్వేషన్లు పెరుగుతాయని GOVT చెబుతోంది. TGలో బీసీల లెక్క తేలుతుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి దీనిపై మీరేమంటారు.
News November 7, 2024
ఇండియాలో IIT ఢిల్లీ టాప్
భారతదేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను QS ఆసియా విడుదలచేసింది. ఈ సంవత్సరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ IIT బాంబేను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆసియాలో 46వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ, 44వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో IIT బాంబే, IIT మద్రాస్, IIT ఖరగ్‌పూర్, IISc బెంగళూరు, IIT కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, IIT గౌహతి, IIT రూర్కీ, JNU ఢిల్లీ ఉన్నాయి.
News November 7, 2024
ధ్రువ్ జురెల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశారు.