News November 7, 2024
అగ్రరాజ్య అధ్యక్షుడికి సకల సౌకర్యాలు!
అమెరికా నూతన అధ్యక్షుడికి సకల సౌకర్యాలు లభిస్తాయి. ఆయనపై ఈగ వాలకుండా చూసుకునే సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. అధికారంలో ఉన్న నాలుగేళ్లు వైట్‌హౌస్‌కు అధిపతిగా ఉంటారు. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి.
Similar News
News November 7, 2024
సందీప్ కిషన్‌తో పూరీ జగన్నాథ్ సినిమా?
లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ల తర్వాత పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఇందులో హీరో సందీప్ కిషన్ నటిస్తారని తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇతనికి కూడా సరైన విజయం దక్కలేదు. దీంతో సందీప్ మేనమామ శ్యామ్ కె.నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. స్నేహితుడు పూరీతో కలిసి మూవీని పట్టాలెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
News November 7, 2024
2027లో ఫలితం అనుభవిస్తారు: విజయసాయిరెడ్డి
AP: YCP కార్యకర్తలను అరెస్ట్ చేసే కొందరు కుల పిచ్చి అధికారులు, TDP నేతలు 2027లో ఫలితం అనుభవించాల్సి ఉంటుందని MP విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు తయారుగా ఉండాలని ఆయన చెప్పారు. ‘పైశాచిక పోస్టులు పెడుతున్న TDP సైకోలకు చెక్ పెట్టరా? ఖాకీలు, YCP సోషల్ మీడియా కార్యకర్తలను నెల రోజుల్లో సెట్ చేస్తాననడం అధికార అహంకారమే. కడప SPపై వేటుతో TDP తన కుల విధానంపై క్లారిటీ ఇచ్చేసిందా?’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
News November 7, 2024
శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన మూడో డబుల్ హండ్రెడ్ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.