News November 7, 2024

KTRపై FIR నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం!

image

TG: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో KTR కార్నర్ కాబోతున్నట్లు మీడియా, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై FIR నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. ఈ అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ACBకి MAUD లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్‌పైనా చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

Similar News

News November 7, 2024

శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ

image

రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన మూడో డబుల్ హండ్రెడ్‌ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

News November 7, 2024

డిగ్రీ అర్హత.. IDBIలో 1,000 ఉద్యోగాలు

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,000 పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి. డిసెంబర్ 1న ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి రూ.29,000-31,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.idbibank.in/

News November 7, 2024

ఏడాదిలో 4000 ATM మెషీన్‌లు క్లోజ్!

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్‌లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్‌లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.