News November 7, 2024
మరో వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ?
AP: మరో వారంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా కంటే రెండు మూడు రెట్ల పదవులు ఎక్కువగా ఉంటాయని సమాచారం. మొత్తం 50 BC కార్పొరేషన్‌లు ఉండగా 35 వరకు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో JSP, BJP నేతలకు కూడా కొన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు టాక్.
Similar News
News November 7, 2024
రైతు బాంధవుడు ఎన్జీ రంగా (1/2)
రైతుల బాధలపై పార్లమెంట్‌లో బలమైన గొంతుక వినిపించిన గొప్ప నేత గోగినేని రంగారావు(NG రంగా). గుంటూరు(D) నిడుబ్రోలులో 1900 NOV 7న జన్మించారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు. జమిందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు. నీతివంతంగా, నిరాడంబరంగా జీవించిన ఆయన పదవులకు ఏనాడూ ఆశ పడలేదు. 1952లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ స్థాపించారు. 1997లో వ్యవసాయ కాలేజీకి NG రంగా పేరు పెట్టారు.
News November 7, 2024
నెహ్రూని వ్యతిరేకించి ఆయన ప్రశంసలే పొందిన ఘనుడు (2/2)
రైతుల కోసం ఎన్జీ రంగా చేసిన పోరాటం అనిర్వచనీయం. రష్యా ముద్రగల సమష్టి సహకార విధానాన్ని నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా దానిని వ్యతిరేకిస్తూ ఎన్జీ ఉత్తేజిత ప్రసంగం చేశారు. ఆ బిల్లు వీగిపోయేలా చేశారు. అనంతరం ‘రంగాజీ పార్లమెంట్‌లో ఉన్నంత కాలం రైతాంగం హాయిగా నిద్రపోవచ్చు’ అని నెహ్రూనే ప్రశంసించడం కొసమెరుపు. 1930-1991 వరకు ఎంపీగా సేవలు అందించిన ఎన్జీ రంగా గిన్నిస్ రికార్డు సాధించారు.
News November 7, 2024
సర్టిఫికెట్స్, ఆధార్‌లో పేర్లు వేరుగా ఉన్నా అప్లై చేసుకోవచ్చు
టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులపై పేర్లలో అక్షరం తేడా ఉన్నా JEE మెయిన్‌కు దరఖాస్తు చేసుకోలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో ఇంటిపేరు సంక్షిప్తంగా ఉన్నా ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌లో NTA మార్పులు చేసింది. పేర్లు మిస్‌మ్యాచ్ అయినట్లు చూపే పాప్ అప్ బాక్స్‌ను మూసేస్తే కొత్త విండో ఓపెనవుతుందని తెలిపింది. అందులో ఆధార్‌పై ఉన్న వివరాలు నమోదు చేయాలని పేర్కొంది.