News November 7, 2024

US ఎన్నికలు: అమెరికాలో ఎక్కువ సెర్చ్ చేసింది ఏంటంటే?

image

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. గత నెల 31 నుంచి ఈనెల 6వరకు ఇండియాలో ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్ రివీల్ చేసింది. ఇండియాలో అధికంగా డొనాల్డ్ ట్రంప్ గురించి సెర్చ్ చేసినట్లు తెలిపింది. కేవలం తమిళనాడులోనే కమలా హారిస్ గురించి సెర్చ్ చేశారు. అత్యధికంగా సెర్చ్ చేసింది మాత్రం డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన విషయం గురించే.

Similar News

News November 7, 2024

రైతు బాంధవుడు ఎన్జీ రంగా (1/2)

image

రైతుల బాధలపై పార్లమెంట్‌లో బలమైన గొంతుక వినిపించిన గొప్ప నేత గోగినేని రంగారావు(NG రంగా). గుంటూరు(D) నిడుబ్రోలులో 1900 NOV 7న జన్మించారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు. జమిందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు. నీతివంతంగా, నిరాడంబరంగా జీవించిన ఆయన పదవులకు ఏనాడూ ఆశ పడలేదు. 1952లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ స్థాపించారు. 1997లో వ్యవసాయ కాలేజీకి NG రంగా పేరు పెట్టారు.

News November 7, 2024

నెహ్రూని వ్యతిరేకించి ఆయన ప్రశంసలే పొందిన ఘనుడు (2/2)

image

రైతుల కోసం ఎన్జీ రంగా చేసిన పోరాటం అనిర్వచనీయం. రష్యా ముద్రగల సమష్టి సహకార విధానాన్ని నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా దానిని వ్యతిరేకిస్తూ ఎన్జీ ఉత్తేజిత ప్రసంగం చేశారు. ఆ బిల్లు వీగిపోయేలా చేశారు. అనంతరం ‘రంగాజీ పార్లమెంట్‌లో ఉన్నంత కాలం రైతాంగం హాయిగా నిద్రపోవచ్చు’ అని నెహ్రూనే ప్రశంసించడం కొసమెరుపు. 1930-1991 వరకు ఎంపీగా సేవలు అందించిన ఎన్జీ రంగా గిన్నిస్ రికార్డు సాధించారు.

News November 7, 2024

సర్టిఫికెట్స్, ఆధార్‌లో పేర్లు వేరుగా ఉన్నా అప్లై చేసుకోవచ్చు

image

టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులపై పేర్లలో అక్షరం తేడా ఉన్నా JEE మెయిన్‌కు దరఖాస్తు చేసుకోలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో ఇంటిపేరు సంక్షిప్తంగా ఉన్నా ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌లో NTA మార్పులు చేసింది. పేర్లు మిస్‌మ్యాచ్ అయినట్లు చూపే పాప్ అప్ బాక్స్‌ను మూసేస్తే కొత్త విండో ఓపెనవుతుందని తెలిపింది. అందులో ఆధార్‌పై ఉన్న వివరాలు నమోదు చేయాలని పేర్కొంది.