News November 7, 2024
అమెరికా CIA చీఫ్‌గా కశ్యప్ పటేల్?

ట్రంప్ ప్రభుత్వంలో ఇండో అమెరికన్‌కు అత్యున్నత పదవి దక్కనున్నట్లు సమాచారం. గూఢచార సంస్థ CIA చీఫ్‌గా కశ్యప్ పటేల్‌ను నియమిస్తారని తెలుస్తోంది. గుజరాత్ మూలాలున్న ఈయన పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి USకు వలస వచ్చారు. పటేల్ 1980లో న్యూయార్క్‌లో జన్మించారు. లండన్ వర్సిటీ నుంచి ఇంటర్నేషన్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి టర్మ్‌లో డిఫెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లోని అత్యున్నత పదవుల్లో కశ్యప్ పనిచేశారు.
Similar News
News January 21, 2026
రెహమాన్ గొప్ప కంపోజర్, మంచి వ్యక్తి: RGV

‘జయహో’ పాట విషయంలో ఏఆర్ రెహమాన్‌పై తన <<18913562>>వ్యాఖ్యలను<<>> తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. తన దృష్టిలో రెహమాన్ గొప్ప కంపోజర్ అని, తాను కలిసినవారిలోకెల్లా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఇతరుల క్రెడిట్ తీసుకునేవారిలో చివర ఉండేది ఆయనేనని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఇప్పటికైనా నెగటివ్ ప్రచారానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్లు Xలో రాసుకొచ్చారు.
News January 21, 2026
కేరళలో పాగా వేయడం BJPకి సాధ్యమేనా?

తిరువనంతపురం మేయర్ స్థానాన్ని గెల్చుకున్న BJP అదే ఊపుతో APRలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఎన్నికల బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు అప్పగించింది. ప్రభుత్వ స్థాపనే లక్ష్యమని హోమ్ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే బిహార్‌లా కేరళలో అధికారం అంత ఈజీ కాదని, BJP ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగినా చాలా సవాళ్లు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. LDF, UDF బలంగా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.
News January 21, 2026
వీటిని క్లీన్ చేస్తున్నారా?

మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్ టూల్స్‌ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.


