News November 7, 2024

కులగణనకు మద్దతుగా చైతన్య యాత్ర

image

TG: కులగణనకు మద్దతుగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చైతన్య యాత్రను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కులగణన సమగ్రంగా జరిగితే BCల లెక్క తేలుతుందన్నారు. దీంతో జనాభా ప్రకారం బీసీలకు బడ్జెట్, రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ యాత్ర ద్వారా 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 650 మండలాలు, 12,750 గ్రామాల్లో బీసీలను చైతన్యం చేస్తామని ఆయన చెప్పారు.

Similar News

News December 30, 2025

హైదరాబాద్‌లో కొత్త కమిషనరేట్లు.. ఐపీఎస్‌ల బదిలీలు

image

HYDలో కమిషనరేట్లను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ(రాచకొండ స్థానంలో), మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. దీంతో పలువురు IPSలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. HYD ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు(ఫొటోలో), మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా ఎం.రమేశ్, యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించింది.

News December 29, 2025

PHOTOS: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

image

AP: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గం. వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 10రోజుల్లో దర్శనానికి మొత్తం 180 గంటల సమయం ఉంటే.. దానిలో టీటీడీ సామాన్యులకే 164 గంటలు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన తిరుమల ఆలయ ఫొటోలను పైన ఉన్న గ్యాలరీలో చూడొచ్చు.

News December 29, 2025

నవీన్ యాదవ్ ఎన్నిక రద్దు చేయాలి: హైకోర్టులో సునీత పిటిషన్

image

TG: జూబ్లీహిల్స్ MLAగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని BRS అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలు తక్కువగా చూపారని ఆరోపించారు. ప్రచారంలో కూడా రూల్స్‌ ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, సునీత దాఖలు చేసిన పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పెండింగ్‌లో ఉంది.