News November 7, 2024

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: AUS PM

image

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

Similar News

News November 7, 2024

మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

image

TG: మాజీ మంత్రి, BRS MLA మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. గత ఏడాది జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం నోటీసులిచ్చింది.

News November 7, 2024

యూనస్‌తో పాత లెక్కలు.. ట్రంప్ చుక్కలు చూపిస్తారా!

image

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పెద్ద, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్‌కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తారని నిపుణుల అంచనా. 2016లో ట్రంప్ గెలిచాక బంగ్లా డెలిగేట్స్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా యూనస్‌ను గుర్తుచేశారు. ‘ఆ ఢాకా మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ? నేను ఓడిపోవాలని ఆయన విరాళం ఇచ్చినట్టు విన్నాను’ అని హసీనాకు షాకిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడి, ఇతర అంశాలపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారు.

News November 7, 2024

Jet Airways ఆస్తులు అమ్మేయండి: సుప్రీంకోర్టు

image

Jet Airways ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దివాలా ప్రక్రియ ఆరంభించాలని ఆదేశించింది. రిజల్యూషన్ ప్లాన్ అమల్లో JKC విఫలమైందని పేర్కొంది. ప్లాన్ ప్రకారం వారు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టలేదని, రూ.226 కోట్ల ఉద్యోగ బకాయిలు చెల్లించలేదని గమనించిన కోర్టు NCLAT తీర్పును పక్కన పెట్టేసింది. రుణదాతలు, ఉద్యోగులు, స్టేక్ హోల్డర్ల ప్రయోజనం కోసం లిక్విడేషన్ తప్పనిసరని వెల్లడించింది.