News November 7, 2024

మహిళలకు ప్రతినెలా రూ.3వేలు: రాహుల్ గాంధీ

image

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.

Similar News

News January 24, 2026

‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

image

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్‌లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.

News January 24, 2026

పేర్ని నాని – అనగాని మధ్య డైలాగ్ వార్

image

AP: మంత్రి అనగాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సంస్కారహీనుడు, మతిస్తిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ. ఆయన అడిగిన రూ.25 కోట్లు జగన్‌ ఇచ్చుంటే ఇవాళ నా పక్కన ఉండేవారు’ అని పేర్ని నాని విమర్శించారు. అటు ‘తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డ్యాష్‌లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేది ఏంటి? వాడి బతుకేంటో నాకు తెలుసు’ అని అనగాని తీవ్రంగా స్పందించారు.

News January 24, 2026

పులిపిర్లకు ఇలా చెక్

image

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. అవి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దితే పూర్తిగా తగ్గిపోతాయి. • ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.