News November 7, 2024

కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక

image

చల్లపల్లి మండలం కృష్ణానది తీరానా నడకుదురులోని పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధమైంది. ఇక్కడే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసుడిని సంహరించాడని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం నరకొత్తూరు నుంచి నడకుదురుగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలో పాటలీ వృక్షం ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతి దీపావళికి నరకసురుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. కార్తీక మాసంలో భక్తులు ఇక్కడి నదిలో స్నానమాచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు.

Similar News

News January 14, 2025

మండవల్లిలో రాష్ట్రస్థాయి పొటేళ్ల పందేలు

image

మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహించగా ఈ పోటీల్లో 3 రాష్ట్రాల నుంచి సుమారు 100 నుంచి 120 పొటేళ్లు పాల్గొన్నాయి. గ్రామంలో తొలిసారి 3 రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను తిలకించారు.

News January 13, 2025

అధిష్ఠానం వద్దకు నూజివీడు తెలుగు తమ్ముళ్ల రగడ 

image

నూజివీడులో తెలుగు తమ్ముళ్ల రగడ అధిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి పార్థసారథి వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినాటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని జెండా పట్టిన వారికి కాకుండా, అధికారంలోకి రాగానే టీడీపీ తీర్థం తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాగా చాట్రాయి మండలంలో టీడీపీకి కార్యకర్తలు రాజీనామా చేశారు.

News January 13, 2025

కృష్ణా: భోగి మంట వేస్తున్నారా..?

image

సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.