News November 7, 2024
మధ్యాహ్నం జగన్ కీలక ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై నమోదవుతున్న కేసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా వారం రోజుల్లోనే 107 మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News November 7, 2024
స్వచ్ఛమైన గాలి దొరికే పట్టణాలివే
తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. ఇదిలా ఉంటే దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరాం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్(46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.
News November 7, 2024
వాస్తు పిచ్చితో రూ.3కోట్లు వృథా: హరీశ్ రావు
AP: సచివాలయంలో <<14547237>>మార్పులపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వాస్తు పిచ్చితో రేవంత్ రెడ్డి పూటకో మార్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క గేటు మార్పు కోసం రూ.3.2కోట్ల దుబారా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్‌తో సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. కాగా సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ప్రధాన ద్వారంను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News November 7, 2024
గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేస్తానన్న MLA అభ్యర్థి
మహారాష్ట్ర ఎన్నికల్లో నేతలు విచిత్రమైన హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేయించి జీవనోపాధి కల్పిస్తానని పర్లీ NCP (SCP) అభ్యర్థి రాజాసాహెబ్ దేశ్‌ముఖ్ హామీ ఇవ్వడం వైరల్‌గా మారింది. మంత్రి, తన ప్రత్యర్థి ధనంజయ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి కల్పించకపోవడంతో వారికి పెళ్లిళ్లు కావడం లేదని విమర్శించారు. దీనిపై మీడియా వివరణ కోరగా దేశ్‌ముఖ్ అందుబాటులోకి రాలేదు.