News November 7, 2024

ధ్రువ్ జురెల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్

image

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశారు.

Similar News

News March 25, 2026

అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

image

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్‌ఫ్లుయెన్స్‌ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్‌లో జరుగుతున్న ఈ టాక్టిక్స్‌కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.

News March 25, 2026

రామ్ చరణ్‌కు గాయం?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదమేమీ లేదని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు టాక్. చరణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 25, 2026

ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనంది: ట్రంప్

image

న్యూక్లియర్ వెపన్స్‌ను ఎప్పటికీ తయారు చేయనని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన చర్చల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోందని, ఇరాన్ ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతోందని అన్నారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ చర్చల వార్తలను కొట్టిపారేస్తున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఐదు రోజుల గడువు ఇచ్చి డీల్ కుదురుతుందన్న ఆశతో ఉన్నారు.