News November 7, 2024
బెంగళూరు పర్యటనకు హైడ్రా బృందం
TG: హైడ్రా బృందం రెండు రోజుల పర్యటనకు గాను బెంగళూరు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బృందం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త నెమ్మదించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో నిఘా, రియల్ టైమ్‌లో కబ్జాలను కనిపెట్టేలా టెక్నాలజీని హైడ్రా పటిష్ఠపర్చుకుంటోంది.
Similar News
News January 14, 2025
కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే: కేటీఆర్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తెలంగాణ పరిస్థితి Kakistocracyగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థం పనికిరాని లేదా తక్కువ అర్హత కలిగిన చిత్తశుద్ధి లేని పౌరుల చేతిలో పాలన ఉండటం. బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News January 14, 2025
‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లపై ఆర్జీవీ సెటైర్లు
‘గేమ్ ఛేంజర్’ మూవీ కలెక్షన్లపై దర్శకుడు RGV సెటైర్లు వేశారు. ఒకవేళ GC తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే ‘పుష్ప-2’ రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న RRR మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో అబద్దాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు రాసుకొచ్చారు.
News January 14, 2025
పవన్ కొన్న ఈ బుక్ గురించి తెలుసా?
ఇటీవల Dy.CM పవన్ ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో SMలో దీని గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ బుక్ రచయిత విక్టరీ ఫ్రాంక్ అనే మానసిక వైద్యుడు. ‘మనిషి నిస్సహాయ స్థితిలో ఉండి అర్థం లేని బాధని, అణచివేతని భరిస్తున్నపుడు దానిని తట్టుకొని ఎలా ముందుకు వెళ్లాలి’ అని స్వీయ అనుభవాన్ని ఇందులో రాసినట్లుగా చెబుతున్నారు.