News November 7, 2024
‘మహాలక్ష్మీ’ పథకం ఉద్దేశం నెరవేరుతోంది: సీఎం రేవంత్
TG: ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలనే సంకల్పంతో ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించామని CM రేవంత్ అన్నారు. ‘మహాలక్ష్మీ పథకాన్ని ఉపయోగించుకుని విద్యార్థినులు మైదానాలకు వెళ్లి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు CM రిప్లై ఇచ్చారు. ‘ఈ మహాలక్ష్ములను చూస్తుంటే మా ఉద్దేశం నెరవేరుతోందని అర్థమవుతోంది. చాలా సంతోషం. వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2024
విరాట్ 2027 వరకు ఆడతారు: జ్యోతిషుడు
గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతుండటంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారికి ఆందోళన అవసరం లేదని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పారు. ‘విరాట్ గురించి ఆయన ఫ్యాన్స్ నన్ను తరచూ అడుగుతుంటారు. ఆయన కనీసం 2027 వరకు ఆడతారు. కోహ్లీ బ్యాట్ పరుగుల వరద పారించే సమయం రానుంది. సచిన్ రికార్డుల్ని దాటలేకపోవచ్చు కానీ గవాస్కర్, ద్రవిడ్‌ను దాటుతారు’ అని అంచనా వేశారు.
News November 7, 2024
గోవాకు విదేశీయుల తాకిడి తగ్గుతోంది!
విహారం, విడిది కోసం గోవాకు వచ్చే విదేశీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా ప్యాండమిక్ తరువాత ఈ ట్రెండ్ పెరిగింది. 2019లో గోవాకు 9.4 లక్షల మంది విదేశీయులు విచ్చేశారు. అయితే 2023లో ఆ సంఖ్య 4.03 లక్షలకు తగ్గింది. ఇది 60 శాతం తగ్గుదలను సూచిస్తోంది. గోవాలో ట్యాక్సీ మాఫియా వల్ల కొందరు విదేశీయులు దోపిడీకి గురయ్యామని భావించడం, ఇతరత్రా అసౌకర్యాల వల్ల గోవా రావడం తగ్గించినట్టు తెలుస్తోంది.
News November 7, 2024
పోటీ చేయలేక పారిపోయిన జగన్ ముఠా: TDP
AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.