News November 7, 2024

ట్రంప్ 2.0: డెమోక్రాట్లను జైలుకు పంపిస్తారా?

image

డొనాల్డ్ ట్రంప్ కొందరు డెమోక్రాట్లపై ప్రతీకారం తీర్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని, తాను ఓడిపోలేదని, ఓటమిని అంగీకరించి వైట్‌హౌస్‌ను వీడాల్సింది కాదని ఆయన చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. చివరి 5 ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఎప్పుడూ పడనన్ని ఓట్లు (8CR) బైడెన్‌కు రావడం గమనార్హం.

Similar News

News February 13, 2026

APPLY NOW: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌(DMRC)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, BE/BTech, MBA, LLB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/స్క్రీనింగ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.delhimetrorail.com

News February 13, 2026

శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు?

image

‘ఉప’ అంటే సమీపంగా, ‘వాసం’ అంటే ఉండటం. మనసును దైవానికి దగ్గరగా ఉంచడమే ఉపవాసం. దీనివల్ల ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనే శక్తి పెరుగుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. శాస్త్రీయంగానూ ఇందువల్ల అనేక లాభాలుంటాయి. శరీరంలోని విషతుల్యాలు తొలగి ప్రాణశక్తి పెరుగుతుంది. భోజనంపై ఆసక్తిని తగ్గించి, దైవచింతనపై దృష్టి సారించేలా చేస్తుంది. భక్తుడిలో క్రమశిక్షణను, పట్టుదలను పెంపొందించి శివానుగ్రహానికి పాత్రులను చేస్తుంది.

News February 13, 2026

మినుము, పెసర.. 20 రోజులు దాటాకా కలుపు నివారణ

image

మినుము, పెసర విత్తిన 20 రోజులకు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే 2,3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలోఫాప్ ఇథైల్ 5% 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% 250ml కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గడ్డిజాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200ml లేదా ఫోమెసాఫెన్ 11.1% + ఫ్లుజిఫాప్-పి-బ్యుటెల్ 11.1% 400 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.