News November 7, 2024

STOCK MARKETS: రూ.3.5లక్షల కోట్ల నష్టం

image

స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.

Similar News

News November 7, 2024

పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

image

AP: రాష్ట్ర సచివాలయంలో Dy.CM పవన్‌తో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ట్వీట్ చేశారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారని పేర్కొన్నారు.

News November 7, 2024

యూరప్ పవర్‌హౌస్ జర్మనీలో రాజకీయ సంక్షోభం

image

జర్మనీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ట్రాఫిక్ లైట్ సంకీర్ణంగా పిలిచే SDP, గ్రీన్స్, FDP కూటమి చీలిపోయింది. ఆర్థిక విధానాల పరంగా సహకరించడం లేదని FM క్రిస్టియన్ లిండ్నర్‌ను ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ (SDP) డిస్మిస్ చేశారు. దీంతో FDPకి చెందిన రవాణా, న్యాయ, విద్యా మంత్రులు స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. మైనారిటీలో పడ్డ SDP, గ్రీన్స్ కూటమి జనవరిలో విశ్వాస తీర్మానం నెగ్గాలి. ప్రజలైతే ఎన్నికలు కోరుకుంటున్నారు.

News November 7, 2024

ఇక జర్మనీ ఎకానమీ పనైపోయినట్టే!

image

జర్మనీ ఎకానమీ పతనం అంచున నిలబడింది. మానుఫ్యాక్చరింగ్ గ్రోత్ నెగటివ్‌లోకి వెళ్లింది. అప్పులు పెరిగాయి. పడిపోయిన GDP పుంజుకొనే అవకాశమే కనిపించడం లేదు. బడ్జెట్ లేనప్పటికీ ఉక్రెయిన్‌కు సాయం చేస్తోంది. తానే ఆంక్షలు పెట్టి రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ను చీప్‌గా కొనలేక ఇబ్బంది పడుతోంది. పెరిగిన పవర్, ఫుడ్ ఛార్జీలు, ద్రవ్యోల్బణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు.