News November 7, 2024

డా.యల్లాప్రగడ సుబ్బారావు గురించి తెలుసా?

image

డా.యల్లాప్రగడ <<14550601>>సుబ్బారావు<<>> భీమవరంలో 1895లో జన్మించారు. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి PhD పొందారు. కణాల్లో ATP పనితీరును కనుగొన్నారు. క్యాన్సర్ చికిత్సకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేశారు. హెట్రోజెన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీ బయోటిక్స్‌ను ప్రపంచానికి అందించారు. వండర్ డ్రగ్స్ మాంత్రికుడిగా పేరొందిన ఆయన 1948లో కన్నుమూశారు.

Similar News

News January 20, 2026

‘జోన్ జీరో’.. ఫిట్‌నెస్ కోసం కొత్త ట్రెండ్

image

జిమ్‌కు వెళ్లకుండా, చెమట పట్టకుండా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారి కోసం ఇప్పుడు Zone Zero అనే కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ వైరలవుతోంది. శరీరానికి అధిక శ్రమ ఇవ్వకుండా చేసే అత్యంత తేలికపాటి వ్యాయామ పద్ధతే ఇది. మన హార్ట్ రేటు 50% దాటకుండా తక్కువ శ్రమతో చేసే నడక, స్ట్రెచింగ్ లేదా ఇంటి పనులు దీని కిందకు వస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

News January 20, 2026

350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>సెంట్రల్<<>> బ్యాంక్ ఇండియా 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి CFA/CA, MBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్, PGDBA, PGDBM, PGPM, PGDM అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఎగ్జామ్ FEB/మార్చి 2026లో నిర్వహిస్తారు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in

News January 20, 2026

JAN 26 తర్వాత సాదా బైనామాలపై కొత్త రూల్స్!

image

TG: LRSలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 9 L సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించడానికి GOVT కొత్త రూల్స్ సిద్ధం చేస్తోంది. భూ భారతిలో సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారులు, భూ యజమానుల మధ్య వివాదాలతో వీటిని రూపొందిస్తోంది. అఫిడవిట్ల విధానాన్నీ మార్చనుంది. ఇవి JAN26 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా దరఖాస్తుదారులకు హక్కులు కల్పిస్తే అధికారులపై కోర్టులకు వెళ్తామని యజమానులు హెచ్చరించడంతో తర్జనభర్జన పడుతున్నారు.