News November 7, 2024
యూనస్‌తో పాత లెక్కలు.. ట్రంప్ చుక్కలు చూపిస్తారా!
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పెద్ద, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్‌కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తారని నిపుణుల అంచనా. 2016లో ట్రంప్ గెలిచాక బంగ్లా డెలిగేట్స్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా యూనస్‌ను గుర్తుచేశారు. ‘ఆ ఢాకా మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ? నేను ఓడిపోవాలని ఆయన విరాళం ఇచ్చినట్టు విన్నాను’ అని హసీనాకు షాకిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడి, ఇతర అంశాలపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారు.
Similar News
News November 7, 2024
పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ
AP: రాష్ట్ర సచివాలయంలో Dy.CM పవన్‌తో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ట్వీట్ చేశారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారని పేర్కొన్నారు.
News November 7, 2024
యూరప్ పవర్‌హౌస్ జర్మనీలో రాజకీయ సంక్షోభం
జర్మనీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ట్రాఫిక్ లైట్ సంకీర్ణంగా పిలిచే SDP, గ్రీన్స్, FDP కూటమి చీలిపోయింది. ఆర్థిక విధానాల పరంగా సహకరించడం లేదని FM క్రిస్టియన్ లిండ్నర్‌ను ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ (SDP) డిస్మిస్ చేశారు. దీంతో FDPకి చెందిన రవాణా, న్యాయ, విద్యా మంత్రులు స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. మైనారిటీలో పడ్డ SDP, గ్రీన్స్ కూటమి జనవరిలో విశ్వాస తీర్మానం నెగ్గాలి. ప్రజలైతే ఎన్నికలు కోరుకుంటున్నారు.
News November 7, 2024
ఇక జర్మనీ ఎకానమీ పనైపోయినట్టే!
జర్మనీ ఎకానమీ పతనం అంచున నిలబడింది. మానుఫ్యాక్చరింగ్ గ్రోత్ నెగటివ్‌లోకి వెళ్లింది. అప్పులు పెరిగాయి. పడిపోయిన GDP పుంజుకొనే అవకాశమే కనిపించడం లేదు. బడ్జెట్ లేనప్పటికీ ఉక్రెయిన్‌కు సాయం చేస్తోంది. తానే ఆంక్షలు పెట్టి రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ను చీప్‌గా కొనలేక ఇబ్బంది పడుతోంది. పెరిగిన పవర్, ఫుడ్ ఛార్జీలు, ద్రవ్యోల్బణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు.