News November 7, 2024
శ్రీమంతులు అంటే వీళ్లే!
సంపదను సృష్టించడం గొప్పకాదు. ఆ సంపదను పేదలకు దానం చేసే మనసుండటం గొప్ప. అలా తమ సంపదను దాతృత్వంతో విరాళంగా ఇచ్చిన బిలియనీర్లు ఎవరో తెలుసుకుందాం. ఇండియాకు చెందిన జమ్షెడ్జీ టాటా ఏకంగా $102.4 బిలియన్లు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత బిల్ గేట్స్($75.8 బిలియన్), వారెన్ బఫెట్ ($32.1 బిలియన్), జార్జ్ సోరోస్($32B), అజీమ్ ప్రేమ్‌జీ($21B), మైఖేల్ బ్లూమ్‌బెర్గ్($12.7B), ఎలాన్ మస్క్($7.6B) ఉన్నారు.
Similar News
News November 7, 2024
కాంగ్రెస్ పతనానికి 3 కారణాలు చెప్పిన సింధియా
కాంగ్రెస్ పార్టీ వేగంగా పతనమవుతోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ‘ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పట్టు తప్పింది. ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం మొదటిది. ప్రజలతో సంబంధాలు తెగిపోవడం రెండోది. భారతదేశ విజన్‌కు దూరమవ్వడం మూడోది. ఈ మూడూ లేనప్పుడు పార్టీని ప్రజలు నమ్మడం మానేస్తారు. ప్రస్తుతం దాని దుస్థితి ఇదే’ అని అన్నారు. 2020లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.
News November 7, 2024
INDvsSA: టీ20 ట్రోఫీ ఇదే
సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా రేపు రాత్రి 8.30గంటలకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఆవిష్కరించారు. ఇద్దరూ కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News November 7, 2024
త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం
AP: దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. త్వరలోనే దేవాలయ ట్రస్టుబోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతామూర్తుల మంత్రోచ్చారణ వినిపించాలని పేర్కొన్నారు.