News November 7, 2024
ఆ రెండు షేర్లు భారీగా పతనం

హిందాల్కో షేర్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌లో 8.42% నష్టపోయాయి. యూఎస్‌కు చెందిన అనుబంధ సంస్థ Novelis Q2 లాభం 18 శాతం క్షీణించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే గత ఏడాది కాలంలో 165% రిటర్న్ ఇచ్చిన TRENT షేర్లు 6.12% నష్టపోయాయి. Q2 రిజల్ట్స్ 39% (YoY) మేర పెరిగినా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. అలాగే ఇతరత్రా లాభాలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Similar News
News January 23, 2026
భీమవరం: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్

భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు. ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్న వారితో కొంతసేపు మాట్లాడి, అన్న క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, రుచి, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
News January 23, 2026
BELలో 99 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని BEL 99 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech, BCom, BBA, BBM, డిప్లొమా, ITI అర్హత గలవారు FEB 5, 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. Engg. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.17,500, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు రూ.12,500, ITI వారికి రూ.11,040 చెల్లిస్తారు. అప్రెంటిస్‌లుగా ఏడాది పూర్తి చేసుకున్నవారికి రాత పరీక్ష నిర్వహించి ట్రైనీ ఇంజినీర్లు, అడ్వాన్స్‌డ్ ట్రైనీస్‌గా నియమించుకుంటారు.
News January 23, 2026
మేడారం జాతరకు 28 స్పెషల్ రైళ్లు

మేడారం జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 28 జన్‌సాధారణ్ రైళ్లను నడపనుంది. ఈ నెల 28, 30, FEB 1 తేదీల్లో సికింద్రాబాద్-మంచిర్యాల, మంచిర్యాల-సికింద్రాబాద్, 29, 31 తేదీల్లో SEC-సిర్పూర్ కాగజ్ నగర్, 28 నుంచి 31 మధ్య NZB-WGL, WGL-NZB, 28 నుంచి 31 తేదీల్లో కాజీపేట-ఖమ్మం, FEB 1 వరకు ఖమ్మం-కాజీపేట, 28న ADB-కాజీపేట, 29న కాజీపేట-ఆదిలాబాద్ మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటో స్లైడ్ చేయండి.


