News November 7, 2024
ఆర్చరికి ఎంపికైన పీయూ విద్యార్థులు వీళ్లే !
PUలో ఆర్చరి స్త్రీ, పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌతేజోన్(ఆలిండియా ఇంటర్ యూనివర్సిటి) టోర్నమెంట్ లో పాల్గొనేందుకు గురువారం ఎంపికలు నిర్వహించినట్లు PD డా. వై.శ్రీనివాసులు తెలిపారు. పురుషుల విభాగంలో విష్ణువర్థన్, భరత్ కుమార్, స్త్రీల విభాగంలో సుజాత, సునిత ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో NTR కాలేజ్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, కోచ్ జ్ఞానేశ్వర్, PDలు హరిబాబు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2024
మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలను వంచిస్తున్న కాంగ్రెస్: మందకృష్ణ
మహబూబ్నగర్ జిల్లాలో నేడు మాదిగల ధర్మ యుద్ధ మహాసభ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఆగస్టు1 సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లు రాష్ట్రాల వారీగా అమలు చేయాలని తీర్పు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలను వంచిస్తుందని అన్నారు. దీంతో మాదిగలు భవిష్యత్తులో మరింత మోసపోయే అవకాశముందని అన్నారు.
News November 7, 2024
మాడుగుల: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి !
కన్న కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన మాడుగుల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుడిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు కొడుకులు. వారంతా HYDలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దసరాకు సొంతూరికి వచ్చిన వారు 13న మద్యం మైకంలో గొడవపడ్డారు. పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకు సురేశ్‌ను తండ్రి నరికి చంపి పొలంలో పాతిపెట్టారు. నేడు మాడుగుల పోలీసులకు నిందితులు లొంగిపోవడంతో దర్యాప్తు చేపట్టారు.
News November 7, 2024
BREAKING: MBNR: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన DEO
ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ DEO రవీందర్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వారి వివరాల ప్రకారం.. ఉపాధ్యాయునికి సీనియారిటీ విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు డీఈఓను సంప్రదించగా రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ డీఎస్పీ DEO ఇంట్లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.